ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రగామి : సుచిత ఎల్ల

వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉందని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. భారత్‌లో కొవిడ్ వ్యాక్సిన్‌ల అత్యవసర అనుమతులు ఇచ్చే విషయమై ఎస్‌ఈసీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన సుచిత్ర ఎల్ల.. కొవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎస్‌ఈసీకి అందించామన్నారు. శాస్త్రవేత్తలు 9 నెలల కష్టపడి పనిచేశారని వివరించారు. వ్యాక్సిన్ అనుమతులు వస్తే కావాల్సిన డోస్‌ల వివరాలు ఇప్పటికే తమకు అందాయని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలని సూచించారు.