కొవాగ్జిన్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వ గుర్తింపు ..

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారతదేశం రూపొందించిన కొవాగ్జిన్‌ను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. కొవిషీల్డ్‌ను ఇదివరకే గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవ్యాక్సిన్‌ను కూడా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ బిబి ఐబిపికోరవి (చైనాకు చెందిన సైనోఫార్మ్ తయారీ) వ్యాక్సిన్లను వేసుకుని ఆస్ట్రేలియాను సందర్శించే ప్రయాణికులను అమనుమతించనున్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన తెరాపిటిక్ గూడ్స్ అడినిస్ట్రేషన్(టిజిఎ) ప్రకటించింది. కోవాగ్జిన్ వేసుకున్న 12 సంవత్సరాలు ఆపైన వయసు ఉన్న ప్రయాణికులు, బిబిఐపివికోర్‌వి వ్యాక్సిన్ వేసుకున్న 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసుగల ప్రయాణికులను అనుమతించనున్నట్లు తెలిపింది.