దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 2 లక్షలకు పైగా

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‍లో మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 14,73,210 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,17,353 కొత్త కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917 చేరింది. నిన్న 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,74,308 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రియశీల కేసులు 15 లక్షలకు పైబడి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ రేటు 10.46 శాతానికి పెరిగింది. ఇక నిన్న లక్షమందికి పైగా కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 1,18,302 మంది కోలుకోగా మొత్తంగా కోటీ 25 లక్షల మంది వైరస్‍ను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 88.31 శాతానికి పడిపోయింది.