ఏపీలో కొత్తగా 6,923 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 76,416 మందికి పరీక్షలు నిర్వహించగా 6,923 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకూ 56,00,202 మందికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,674కి చేరింది. తాజాగా 7,796 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,05,090కి చేరింది. గడిచిన 24 గంటల్లో 45 మంది మృతితో మొత్తం మరణాల 5,708కి చేరాయి. యాక్టివ్ కేసులు 64,876 ఉన్నాయి. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 1,04,873 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.






