తెలంగాణలో 1,967 మందికి పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 50,108 మందికి పరీక్షలు నిర్వహించగా 1,967 మందికి పాజిటివ్ తేలింది. ఇప్పటి వరకు 28,50,869 మందికి పరీక్షలు చేయగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,85,833కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 2,058 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 1,54,499కి చేరింది. తాజాగా 9 మంది మృతితో మొత్తం మరణాలు 1,100కి చేరాయి. ఇంకా 30,234 యాక్టివ్ కేసులున్నాయి. ప్రతి మిలియన్ జనాభాలో 76,788 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.






