పంజాబ్ నుంచి వచ్చిన మరో విమానంలో..కరోనా కలకలం
                                    అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఆదే దేశం నుంచి వచ్చిన మరో విమానం లోనూ 173 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటలీలోని రోమ్ నుంచి ఓ విమానం అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అందులో 290 మంది ప్రయాణికులున్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం వీరికి ఎయిర్‌పోర్టులో కొవిడ్‌లో పరీక్షలు చేయగా 173 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో బాధితులను ఐసోలేషన్‌కు తరలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇటలీ నుంచి పంజాబ్ వచ్చిన ఓ విమానంలో 125 మందికి వైరస్ సోకిన విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే.







