5 రోజుల్లో 10 లక్షల కొత్త కేసులు!

అమెరికాలో 2020, జనవరిలో తొలి కరోనా వైరస్ కేసు వెలుగు చూసింది. తరువాత 100 రోజుల్లో 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కేవలం ఐదు రోజుల్లోనే కొత్తగా 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం కొత్తగా 10,00,882 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. అమెరికాలో కరోనా కారణంగా 2,81,199 మంది కన్నుమూశారు. నవంబరు నుంచి ప్రతీరోజూ కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికితోడు వివిధ ఆసుపత్రులలో చేరుతున్న కరోనా బాధితులు సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.