YS Jagan: ఫీనిక్స్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు.. ఘనంగా నిర్వహంచిన వైసీపీ ఎన్ఆర్ఐ కమిటీ
ఫీనిక్స్ (అరిజోనా): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అమెరికాలోని వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలు వర్చువల్ విధానంలో జరిగినప్పటికీ, అమెరికా నలుమూలల నుంచి పార్టీ సభ్యులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్, మాజీ విద్యాశాఖ సలహాదారు ఆలూరు సాంబశివ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా మొదట కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ పటిమను, ఆయన చేపట్టిన ప్రజాసేవా కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ఆడియో-విజువల్‌ని ప్రదర్శించారు.

పార్టీ బలోపేతానికి ఎన్నారైల కృషి అవసరం…
ఈ సందర్భంగా ఆలూరు సాంబశివ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్రులు తమ ప్రాంతం పట్ల చూపిస్తున్న మమకారం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్ రెడ్డి ఎర్రపురెడ్డి, ధీరజ్ పోలా, వంశీ కృష్ణ ఎరువారం, చెన్నా రెడ్డి మద్దూరి, గురు బొగ్గారపు, లక్ష్మి, శ్రీనివాస్ గుప్తా, శ్రీధర్ లక్కిరెడ్డి, రక్మానంద్ మైలా, రమేష్ యాదవ్, శ్రీనివాస్ మొల్లాల, అంజి రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, శ్రీనివాస్ మామిడి, విఘ్నేశ్వర రెడ్డి పొన్నపాటి, దుర్గ కొండా రెడ్డి, జగన్, అనిల్ కొండూరు, రోహిత్ చెరుకుమిల్లి, జ్ఞానదీప్, అనుష, భవిష్య తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.






