TANA: తానా బోర్డ్ చైర్మన్, ఫౌండేషన్ చైర్మన్ ఎవరో?

జూలై నెలలో జరిగిన తానా (TANA) కాన్ఫరెన్స్ లో కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. కొత్త అధ్యక్షుడిగా నరేన్ కొడాలి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తానాలో ముఖ్యమైన బోర్డ్ చైర్మన్. ఫౌండేషన్ చైర్మన్ పదవికి ఇంతవరకు ఎవరినీ ఎన్నుకోలేదు. ఎందుకింత జాప్యం జరుగుతోందని తానా ముఖ్యులను కలిసినప్పుడు తానా (TANA)లో ఇంకా అంతర్గత సమస్యలు ఉన్నట్లే కనిపిస్తోందన్న విషయం బహిర్గతమైంది.
29 జూన్ 2025 తానా ఎన్నికల కమిటీ తరపున శ్రీ కనకంబాబు అయినపూడి ఎన్నికలలో విజేతల పేర్లను ప్రకటించారు. ఈ లిస్ట్‌లో తానా బోర్డ్ కి ఐదుగురిని, ఎగ్జిక్యూటివ్ కమిటీకి 37 మందిని, ఫౌండేషన్ ట్రస్టీలుగా 11 మంది పేర్లను ప్రకటించారు. వీరందరూ కూడా డిట్రాయిట్ లో జరిగిన తానా మహాసభల్లో జూలై 5న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభ్యులంతా తమ పదవులను చేపట్టారు. ఇక అన్నీ సమస్యలు తీరిపోయాయని అందరూ అనుకున్నారు. ఫౌండేషన్ కు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఫౌండేషన్ చైర్మన్, సెక్రటరీ, ట్రజరర్ అనే మూడు పదవులకు తమలో ఒకరిని ఎన్నుకోవాలి. ఎన్నికైన ఆ ముగ్గురూ తానా బోర్డ్ లో నియమితులవుతారు. వారితోపాటు 17 మందితో బోర్డ్ కొలువుతీరుతుంది. ఆ తరువాత బోర్డ్ సభ్యులంతా కలిసి తమలో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకోవాలి. అయితే ఈ చైర్మన్ ఇతర పదవుల ఎంపికకు ఎందుకో జాప్యం ఏర్పడింది. ఈరోజుకు దాదాపు 45రోజులు దాటినప్పటికీ ఇంతవరకు ఈ పదవులపై ఎలాంటి కదలిక కనిపించడం లేదు. ఎవరిని ఎన్నుకోలేదు. ఈ పదవులకు ఎవరి పేర్లను ప్రకటించలేదు. ఇంతవరకు కొత్త బోర్డ్ సభ్యులతో మీటింగ్ జరిపి రాబోయే రెండు సంవత్సరాలకు కార్యక్రమాలు నిర్ణయించి దిశానిర్దేశం చేసే చర్యలు ఏమీ చేపట్టడం జరగలేదు. దీంతో పలువురు తానా సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అన్నీ ప్రాంతాల నుంచి ఎన్నికైన రీజినల్ రిప్రజెంటేటివ్ లు, సర్వీస్ కో ఆర్డినేటర్లకు అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేయాలి. వారంతా అప్పుడే ఉత్సాహంగా కార్యక్రమాలను చేయడం ప్రారంభిస్తారు.
ప్రస్తుతం బరి లో వున్న ఆశావహులు ఎవరో చూద్దాం. ఇప్పటికే గత సంవత్సరం ఫౌండేషన్ లో జరిగిన ఆర్ధిక మోసానికి ఫౌండేషన్ చైర్మన్ గా వచ్చే వ్యక్తి భాద్యతలు ఎక్కువగానే వున్నాయి. ఇప్పటకే అనేక చారిటీ కార్యక్రమాలలో ముందున్న డా. ప్రసాద్ నల్లూరి ని తానా ఫౌండేషన్ చైర్మన్ గా ఉంటే బావుంటుందన్న అభిప్రాయం రావడం వలన ఆయన పేరు పరిశీలన లో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆ పదవి కి కూడా కొంచెం పోటీ ఉందని , ఏకగ్రీవంగా ఆమోదించే పరిస్థితి లేదని తెలుస్తోంది. కాలిఫోర్నియా నుంచి శ్రీ భక్త భల్లా పేరు కూడా వినిపిస్తోంది. ఇంతకుముందు నుంచే బోర్డ్ మెంబర్ గా ఉన్న శ్రీనివాస్ లావు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడంతో బోర్డ్ లో ఆయన స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం కూడా భర్తీ చేయాలి. ఈ స్థానంకోసం శ్రీమతి లక్ష్మీ దేవినేని న్యూజెర్సి నుంచి, శ్రీనివాస్ గోగినేని డిట్రాయిట్ నుంచి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తానా బోర్డు చైర్మన్ గా శ్రీ రవి పొట్లూరి పేరు పరిశీలన లో ఉన్నా, ఆయన ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కొన్నీ ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంత వరకు తానా బోర్డు చైర్మన్ గా ఉన్న డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ను మరొక్క గడువు కు ఉంచితే బావుంటుందని కొందరి వాదన అని తెలుస్తోంది.
ఈ పదవుల నియామకాల్లో ఎందుకింత జాప్యం జరుగుతోందని విచారిస్తే తానాలో ఇంకా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఏ పదవికి ఏకగ్రీవంగా నియామకాలు చేసే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయం పై తానా అధ్యక్షులు డా. నరేన్ కోడాలి ని సంప్రదించగా ” కొన్ని సమస్యలు ఉన్నమాట నిజమే కానీ… అన్ని సర్దుబాటు అవుతున్నాయి, అతి త్వరలో అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్త్యులు ఎన్నుకోబడుతారు” అని హామీ ఇచ్చారు . తానా అధ్యక్షులు గా డా. నవీన్ కోడాలి ఈ సమస్యను కూలంకషంగా పరిసీలించి, అందరిని సంప్రదించి, ఒప్పించి ముందుకెళ్తారని ఆశిద్దాం. అంతే కాదు .. కొందరి వ్యక్తి గత అభిప్రాయాలు, సమీకరణలు కంటే సంస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని దృఢమైన నిర్ణయాలు తీసుకొంటారని ఆశిద్దాం.