TANA: తానా కర్తవ్యం ఏమిటి? అన్న ప్రశ్న కి తానా వివరణ!
నిన్న తెలుగు టైమ్స్ పోర్టల్ లో, నా ఫేస్ బుక్ పేజి లో నేను రాసిన "3.6 మిలియన్ డాలర్ల మోసం తరువాత తానా కర్తవ్యం ఏమిటి? " అన్న న్యూస్ పోస్ట్ కి చాల మంది తానా మిత్రులు ఫోన్ చేసి, మేసేజ్ లు ఇచ్చి తమ అభిప్రాయాలు తెలిపినందుకు, అభినందించినందుకు ధన్యవాదాలు.
తానా (TANA) బోర్డు నుంచి కూడా ముగ్గురు సభ్యులు మాట్లాడారు. తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి కూడా మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు.
డా. నాగేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ.." తానా బోర్డు ఈ ఉదంతం ను మొదటి నుంచి సీరియస్ గానే తీసుకుందని, తెలిసిన వెంటనే శ్రీకాంత్ పొలవరపు తో తాను, ఫౌండేషన్ చైర్మన్ – శశికాంత్ వల్లెపల్లి, ట్రెజరర్ వినయ్ కుమార్ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడమని, శ్రీకాంత్ ఫోన్ లో చెప్పిన విషయాలను ఈమెయిల్ ద్వారా రాత పూర్వకంగా తెప్పించుకొన్నామని, వెంటనే అత్యవసర బోర్డు సమావేశం ఏర్పాటు చేశామని, ఆ మీటింగ్ కి శ్రీకాంత్ పోలవరపు వచ్చేలా చూసామని, బోర్డు మీటింగ్ లో కూడా శ్రీకాంత్ వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే అన్ని విషయాలు బోర్డు మీటింగ్ ముందర, తరువాత కూడా మీడియా కి, న్యూస్ లెటర్ ద్వారా తానా సభలకు తెలియ చేశామని, తానా చాలా పారదర్శకంగా పని చేస్తోందని డా. నాగేంద్ర శ్రీనివాస్ అన్నారు.
బోర్డు నిర్ణయాల ప్రకారం తాను, నరేన్ కొడాలి (తానా లీగల్ లయజెన్), తానా తరుఫున పని చేసే అటార్నీ తో కూలంకషంగా చర్చించామని, ఆయన సలహా – సూచనలు అమలు చేస్తున్నామని డా. నాగేంద్ర శ్రీనివాస్ తెలిపారు.
తానా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నది నిజం కాదని, తాము ఇప్పటికే FBI తో సంప్రదింపులు జరపటానికి ఒక ప్రొసీజర్ వుంటుందని, ఏజెన్సీస్ వుంటాయని, తానా తరుఫున ఏజెన్సీ ఇప్పటికీ FBI అధికారులతో మాట్లాడుతోందని అంతా ఫెడరల్ రూల్స్ ప్రకారం జరుగుతోందని డా. నాగేంద్ర తెలిపారు. అదే విధంగా తానా అటార్నీ శ్రీకాంత్ పోలవరపు తరుఫున పని చేసే లాయర్ తో రెగ్యులర్ గా సంప్రదిస్తున్నారని కూడా తెలిపారు.
ఈ విషయాలు అన్ని చాల సున్నితమైనవి అని, ప్రతి రోజూ అన్ని చెప్పలేమని, స్టేజీ లో వారీగా సభ్యుల కు న్యూస్ లెటర్ ద్వారా చెపుతామని, వదంతులు నమ్మవద్దని నభులను కోరుతున్నామని డా నాగేంద్ర శ్రీనివాస్ తెలిపారు.
చెన్నూరి వెంకట సుబ్బారావు
ఎడిటర్ తెలుగుటైమ్స్







