డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ఫేస్ టు ఫేస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి ముఖాముఖి కలిశారు. జి-20 సదస్సులో భాగంగా ఇద్దరు నేతలు ముఖాముఖి కలుసుకొని కరచాలనం చేసుకున్నారు. త్వరలోనే ప్రత్యేకంగా భేటీ కావాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడిని నేరుగా కలవడం ఇదే తొలిసారి. కాగా, పారిస్ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికాను తిరిగి ఒప్పందంలో భాగస్వామిని చేసేందుకు జి-20 సదస్సు ఒత్తిడి తీసుకురావాలని బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు.













