పెరూలో అమెరికా దౌత్యవేత్తగా కృష్ణ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసి రెండు రోజుల కూడా కాకముందే, భారతీయులకు ట్రంప్ ఓ శుభవార్త వినిపించారు. ఓ భారత సంతతి వ్యక్తికి తన ప్రభుత్వంలో మరో కీలక పదవిని అప్పజెప్పారు. పెరూకు అమెరికా దౌత్యవేత్తగా భారత సంతతి వ్యక్తి అయిన కృష్ణను నియమించారు. 1986 నుంచి అమెరికా దౌత్యవేత్తగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం స్పెయిన్‌లోని అమెరికా ఎంబసీలో డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో దిట్టగా ఆయన పేరు తెచ్చుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి కృష్ణ ఎంఎస్ పట్టా పొందారు. స్పానిస్లో అనర్గళంగా మాట్లాడగలగడంతోపాటు హిందూ, తెలుగు భాషలను కూడా మాట్లాడగలరు. పెరూకు అమెరికా దౌత్యవేత్తగా కృష్ణను నియమిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారిక ప్రకటన చేసింది.













