టాంటెక్స్ మరియు నాట్స్ సంయుక్త ఆద్వర్యంలో ఘనంగా ముగిసిన టాక్స్ & ఎస్టేట్ సదస్సు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మరియు నాట్స్ సంయుక్తంగా మార్చ్ 02 న శ్రీ వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేసారు. ముందుగా బిజినెస్ మరియు మెంబర్ సర్వీసెస్ సమన్వయకర్త శ్రీ చంద్రారెడ్డి పోలిస్ సభను ప్రారంబించి అందరికి స్వాగతం పలికి, టాంటెక్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ముందుగా tax planning కు ముఖ్య అతిధిగా విచ్హేసిన శ్రీ మురళి (myTaxFiler) గారు 2018 సంవత్సరం నుండి వచ్చిన టాక్స్ చట్టం లో వచ్చిన మార్పులను, ఈ సంవత్సరపు గడువు మరియు FBAR, FATCA చట్టాలు, న్యాయబద్దంగా టాక్సు ఢబ్బులు ఆదా చేసే పద్దతులు వివరించారు. అలాగే వాణిజ్య సంస్తలు టాక్సు ఢబ్బులు ఆదా చేసే మరి కొన్ని పద్దతులు సోదాహరణంగా వివరించారు. ప్రేక్షకుల పలు ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు.
తరువాత Estate planning & Financial Services కు ముఖ్య అతిధిగా విచ్హేసిన శ్రీ తిరుమల్ రెడ్డి గారు మాట్లాడుతూ భారత దేశం మరియు అమెరికా దేశాల చట్టాలలో ముఖ్యంగా మరణానంతర ఆస్తుల సంక్రమణం లో తేడాలు వివరిస్తూ Estate Planning ప్రాముఖ్యతను, అవసరాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఒకవేళ చెయ్యని పరిస్తితులలో ఆస్తులు ఎలా, ఎలా చేతులు మారతాయో అది ఎంత క్లిష్టం గా ఉంటుందో వివరించారు. అలాగే డబ్బులు ఆదా చెయ్యల్సిన అవసరం మరియు పిల్లల కాలేజి ఖర్చులు, ఉద్యోగ విరమణానంతర జీవితానికి సంబందించి ఖర్చులు వాటిని సమర్దంగా ఎదుర్కొనడానికి అవలంభించాల్సిన స్ట్రాటెజీలు వాటికి తన సంస్ట చేయగలిగిన సహాయాన్ని వివరించారు. ప్రేక్షకుల పలు ప్రశ్నలకు తను కూడా చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు.
శ్రీ మురళి మరియు శ్రీ తిరుమల్ రెడ్డి గారిని టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి, ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, కోశాధికారి శరత్ రెడ్డి యర్రం, సతీష్ బండారు. సమన్వయకర్త చంద్రారెడ్డి పోలిస్ పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ వీర్నపు చినసత్యం మాట్లాడుతూ శ్రీ మురళి మరియు శ్రీ తిరుమల్ రెడ్డి గారి కమ్యూనిటీ సేవలను ఎంతో కొనియాడారు మరియు వారు పోషక ధాతలుగా ఉన్న విషయాన్నిగుర్తు చేసుకున్నారు . కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మరియు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రసార మాధ్యమాలైన ఫన్ ఏషియా, టీవీ9, టివి5, టి.ఎన్.ఐ, తెలుగు టైమ్స్ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేశారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లంకెలో చూడవచ్చును.










































































