తానా ఎన్నికలు…ఏకగ్రీవాలు
(చెన్నూరి వెంకట సుబ్బారావు)
అమెరికాలో తెలుగు సంఘాల ఎన్నికలు ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ఎవరూ సారధిగా ఉంటారోనని అందరూ ఎదురు చూస్తుంటారు. కొన్ని సంఘాల్లో ఎన్నికల నియామకాలు జరుగుతాయి. మరికొన్ని సంఘాల్లో బ్యాలెట్ ద్వారా సారధులను ఎన్నుకుంటారు. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తానాలో ఎన్నికలు ఎప్పుడూ కోలాహలంగా జరుగుతుంటుంది. ఈసారి జరిగిన తానా ఎన్నికల్లో ఓ విశేషం ఉంది. దాదాపు కీలకమైన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్ వంటి పలు పదవులకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దాదాపు 35 పదవులకు అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికయ్యారు.
అమెరికా జాతీయ తెలుగు సంఘాల్లో మొట్టమొదటిదైన ‘తానా’కు దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచ తెలుగు సంఘాలకు మాతృసంస్థలా తానా ఉంటోంది. కమ్యూనిటీకి పెద్దన్నలా వ్యవహరిస్తుంటుంది. వివిధ జాతీయ, ప్రాంతీయ తెలుగు సంఘాలకు తానా మాతృసంస్థలాంటిది. నేడు నాలుగైదు జాతీయ సంఘాలు అమెరికాలో కనిపిస్తున్నా ఆందులో ఉన్న వాళ్ళంతా ‘తానా’ నుంచి వచ్చినవాళ్ళే. ఓ విధంగా చెప్పాలంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు వేర్వేరుగా కనిపిస్తున్నా మూడు ప్రాంతాల్లోను తెలుగువాడే కనిపిస్తారు. అలాగే అమెరికాలో ఎన్ని సంఘాలు ఉన్నా అందులో ‘తానా’ ఛాయలే ఎక్కువగా కనిపిస్తాయి. అమెరికాలో లక్షలాదిమంది సభ్యులుగా ఉన్న తానా చేసే కార్యక్రమాలు కూడా భారీగానే ఉంటాయి. కమ్యూనిటీకోసం తానా కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతుంటుంది. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తూనే మరోవైపు మాతృరాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కూడా ఎన్నో కార్యక్రమాలను తానా చేస్తోంది. తానా ప్రతి రెండేళ్లకోమారు నిర్వహించే మహాసభలు ప్రపంచం నలుమూలలా ఆకర్షిస్తుంటాయి. అలాంటి తానాలో ఉండటమే ఓ అదృష్టంగా భావించే వాళ్ళు ఎందరో ఉన్నారు.
తానా నిర్వహణ కూడా పటిష్టంగా ఉంటుంది. కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్ కమిటీ), తానా ఫౌండేషన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే విభాగాలు తానా నిర్వహణను సమర్థవంతంగా చూస్తుంది. అన్నీ సంఘాలకు జరిగినట్లుగానే తానాలో కూడా కీలకమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులకు, తానా ఫౌండేషన్ ట్రస్టీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవులకు ఎన్నికలకు జరుగుతుంటాయి. గతంలో ఇలాంటి పదవులకు పెద్దలే పోటీ పడేవారు. దాంతో ఈ పదవులు పెద్దలకే పరిమితమనే అపోహ గతంలో ఉండేది. కానీ యువత ఎక్కువగా కమ్యూనిటీ కార్యక్రమాల్లో పాల్గొనడం?ప్రారంభించిన తరువాత అన్నీ సంఘాల్లో యువత ప్రాబల్యం బాగా పెరిగింది. అలాగే తానాలో కూడా యూత్ సభ్యుల సంఖ్య బాగా పెరిగింది. గత ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో ఎంతోమంది యువకులు పదవులను చేపట్టేందుకు ముందుకు వచ్చారు. దాంతో అప్పటి వరకు తానా ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగినా పెద్దగా ప్రచారం లేకుండా జరిగేవి. కాని యువత పదవులకోసం ఎన్నికల్లో దిగాక తానా ఎన్నికల ప్రచార సరళి మారిపోయింది. విపరీతమైన పబ్లిసిటీి, ఇ-మెయిల్స్, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థనలు, మరోవైపు పోటాపోటీ సమావేశాలతో సాగి చివరకు ఫలితాలు వెలువడేంతవరకు అందరిలోనూ ఉత్కంఠను గతంలో జరిగిన ఎన్నికలు కలిగించింది. ఈసారి కూడా 2019-23 సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ డైరెక్టర్ పదవులకు ఎన్నికల ప్రకటన వెలువడింది. అందరూ గతంలోలాగా ఈసారి కూడా ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని భావించారు. కాని తానా పెద్దలు, ప్రస్తుత అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు ఇతరులు కలిసి అందరితో మాట్లాడి చాలా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా చూశారు. కీలకమైన పదవులకు ఈసారి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం.
ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులకు…
తొలుత తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. అంజయ్య చౌదరి లావు, నరేన్ కొడాలి ఈ పదవి కోసం నామినేషన్లు వేశారు. నరేన్ కొడాలి నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో అంజయ్య చౌదరి వైస్‌ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శి పదవికి రవి పొట్లూరి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ట్రెజరర్ పదవికి సతీష్ వేమూరి, జాయింట్ సెక్రటరీ పదవికి అశోక్‌బాబు కొల్లా, జాయింట్ ట్రెజరర్ పదవికి వెంకట్ కోగంటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్ పదవికి సునీల్ పాంత్రా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి శిరీష తూనుగుంట్ల, కౌన్సిలర్ ఎట్ లార్జ్ పదవికి వినయ్‌కుమార్ మద్దినేని, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ పదవికి లక్ష్మీ దేవినేని, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ పదవికి లోకేష్ కొణిదెల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రీజినల్ కో ఆర్డినేటర్ పదవులకు….
రీజినల్ కో ఆర్డినేటర్ (న్యూఇంగ్లాండ్) పదవికి కోటేశ్వరరావు కందుకూరి, రీజినల్ కో ఆర్డినేటర్ (న్యూయార్క్) పదవికి సుమంత్ రామ్సెట్టి, రీజినల్ కో ఆర్డినేటర్ (న్యూజెర్సి) పదవికి వెంకట్ రాజా కసుకుర్తి, రీజినల్ కో ఆర్డినేటర్ (మిడ్ అట్లాంటిక్) పదవికి సతీష్ చుండ్రు, రీజినల్ కో ఆర్డినేటర్(క్యాపిటల్) పదవికి అనిల్ సి. ఉప్పలపాటి, రీజినల్ కో ఆర్డినేటర్ (అప్పలచియాన్) పదవికి సురేష్ బాబు కాకర్ల, రీజినల్ కో ఆర్డినేటర్ (సౌత్ ఈస్ట్) పదవికి కిరణ్ గోగినేని, రీజినల్ కో ఆర్డినేటర్ (నార్త్) పదవికి కిరణ్ దుగ్గిరాల, రీజినల్ కో ఆర్డినేటర్ (ఒహాయోవ్యాలీ) పదవికి శ్రీనివాస ఆర్. యలవర్తి, రీజినల్ కో ఆర్డినేటర్ (మిడ్వెస్ట్) పదవికి విజయ కృష్ణ మోహన్ చిల్మకూర్, రీజినల్ కో ఆర్డినేటర్ (సౌత్ సెంట్రల్) పదవికి శ్రీధర్ తాళ్ళూరి, రీజినల్ కో ఆర్డినేటర్ (డిఎఫ్‌డబ్ల్యు) పదవికి సాంబయ్య దొడ్డా, రీజినల్ కో ఆర్డినేటర్ (సౌత్ వెస్ట్) పదవికి మురళి తాళ్ళూరి, రీజినల్ కో ఆర్డినేటర్ (నార్త్ సెంట్రల్) పదవికి సాయి వినోద్ తోటకూర, రీజినల్ కో ఆర్డినేటర్ (సదరన్ కాలిఫోర్నియా) పదవికి సురేష్ సి. కందెపు, రీజినల్ కో ఆర్డినేటర్ (నార్తర్న్ కాలిఫోర్నియా) పదవికి రజనీకాంత్ కాకర్ల, రీజినల్ కో ఆర్డినేటర్ (నార్త్ వెస్ట్) పదవికి దేవేంద్రరావు లావు, రీజినల్ కో ఆర్డినేటర్ (రాక్మౌంటెన్) పదవికి నవీన్ కలగర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తానా ఫౌండేషన్ ట్రస్టీ పదవుల కోసం…
తానా ఫౌండేషన్ ట్రస్టీ పదవులకు కూడా పలువురు పోటీ పడుతున్నారు. 5 ట్రస్టీ పదవుల కోసం పలువురు నామినేషన్లు వేశారు. భక్తబల్లా, రాజా సూరపనేని, రవి సామినేని, శ్రీనివాస్ చంద్ గొర్రెపాటి, వెంకట్ ఆర్. యార్లగడ్డ, విశ్వనాథ నాయునిపాటి నామినేషన్లు దాఖలు చేశారు.
డైరెక్టర్ నాన్ డోనర్ 3 పోస్టులకు గాను హనుమయ్యబండ్ల, మురళీ వెన్నం, శ్రీనివాసలావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫౌండేషన్ ట్రస్టీ 2 సంవత్సరాల పదవికాలం ఉన్న ఒక్కపోస్టు కోసం రావు యలమంచిలి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఫౌండేషన్ డోనర్ ట్రస్టీ నాలుగు సంవత్సరాల పదవీకాలం ఉన్న రెండు పోస్టులకు రమాకాంత్ కోయ, సురేష్ పుట్టగుంట నామినేషన్లు వేశారు. వీరిద్దరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బే ఏరియాకు దక్కిన కీలక పదవులు
తానా ఎన్నికల్లో ఈసారి బే ఏరియాకు చెందిన నాయకులు పలు కీలక పదవులకు ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా సతీష్ వేమూరి, జాయింట్ ట్రెజరర్‌గా వెంకట్ కోగంటి, రీజినల్ కో ఆర్డినేటర్ (నార్తర్న్ కాలిఫోర్నియా) పదవికి రజనీకాంత్ కాకర్ల ఎన్నికయ్యారు. ఫౌండేషన్ ట్రస్టీ పదవికి భక్తబల్లా కూడా ఎన్నికవుతున్నారు.













