తానా అన్నపూర్ణ ద్వారా విజయవాడ జనరల్ హాస్పిటల్ లో అన్నదానం

నిస్వార్ధమైన సేవాతత్పరతతో ,కొత్త ఆలోచనలతో తానాను మార్పు దిశగా శరవేగంతో నడిపిపిస్తున్న తానా అధక్షుడు అంజయ్య చౌదరి లావు జన్మదిన సందర్భముగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా తానా కాపిటల్ ఏరియా మరియు న్యూజెర్సీ రీజినల్ రెప్రెసెంటేటివ్లు తానా అన్నపూర్ణ ద్వారా విజయవాడ జనరల్ హాస్పిటల్ లో సుమారు 600 వందల మందికి అన్నదాన కార్యక్రం నిర్వహించారు.
ఈసందర్భంగా తానా కాపిటల్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉయ్యురు మరియు తానా న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ వంశి వాసిరెడ్డి మాట్లాడుతూ నిస్వార్ధమైన సేవాతత్పరతతో అంచలంచలుగా ఎదిగి తానా ను నడిపిస్తున్న అంజయ్య చౌదరి గారి ఎక్సిక్యూటివ్ కమిటీ లో పనిచేయటం ఎంతో ఆనందం ఉందని తెలియచేసారు.











































































