TANA: రేపల్లెలో తానా అన్నదానం విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా రేపల్లె (Repalle) లో మూడురోజులపాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా ఫౌండేషన్ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉన్న పేదలకోసం ‘అన్నపూర్ణ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద ఆసుపత్రుల్లోని పేషంట్లకోసం వచ్చిన సహాయకులకు ఆపన్నహస్తం అందించడంతోపాటు అన్నపూర్ణ కార్యక్రమం ద్వారా భోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.
తానా ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు శశికాంత్ వల్లేపల్లి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇటీవల రేపల్లెలో నిర్వహించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ, తానా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తోంది. అన్నీ దానాల్లో కన్నా అన్నదానం మిన్న అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నపూర్ణ పేరుతో పేదలకు అన్నదానం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చంద్రశేఖర్ కంతేటి టీం కు పేరు పేరు న తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, అమెరికన్ స్కూల్ కమిటీ సభ్యులు కృష్ణప్రసాద్ సోంపల్లికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూనే ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, తానా బోర్డు అఫ్ డైరెక్టర్స్ కి, తానా ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేని, తానా స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తికి ధన్యవాదాలు తెలిపారు.







