విద్యార్ది, విద్యార్దినికి ల్యాప్టాప్ లను అందించిన దాత శ్రీని యలవర్తి
తానా ఆదరణ -క్రిష్ణా జిల్లా, ముష్టికుంట్ల విద్యార్ది, విద్యార్దినికి దాత శ్రీనియలవర్తి సహాయం.
క్రిష్ణా జిల్లా, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన విద్యార్ధులు కామ్న్య గద్దె, సాయిరాం ప్రబాస్ విజ్ఞప్తికి స్పందించి కొలంబస్(ఒహియొ రాష్ట్రం)కి చెందిన శ్రీని యలవర్తి గారు లాప్టాప్లను గురువారం నాడు అందచేసారు. ఈ సందర్బంగా కామ్న్య & సాయిరాం ప్రబాస్ మట్లాడుతూ ఈ సహాయం చేసిన దాత శ్రీ శ్రీని యలవర్తి గారికి, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారికి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ గారికి, ట్రస్టీ మరియు ఆదరణ సమన్వయకర్త రవి సామినేని గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.













