వెంటిలేటర్ డిజైన్ ఆన్లైన్లో…
కొవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ప్రబలడంతో వెంటిలేటర్ల కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు చౌకగా వెంటిలేటర్ల తయారీపై దృష్టి పెటాయి. హ్యూస్టన్‌లోని రైస్ విశ్వవిద్యాలయం సరికొత్త విధానంతో ముందుకొచ్చింది. విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసిన అపోలో బీవీఎం (బ్యాగ్ వాల్వ్ మాస్క్) డిజైన్‌ను ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టును 2019లో డిజైన్ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్లకు డిమాండ్ పెరగడంతో రైస్ ఇంజినీర్లు దీనిలో వైద్యచికిత్సకు అనుగుణంగా మార్పులు చేశారు. దీనికి 300 డాలర్ల లోపే (రూ.22,810) ఖర్చవుతుంది. ఈ వెంటిలేటర్‌ను అత్యవసర చికిత్స అవసరం లేని వారు ఉపయోగించుకొనే విధంగా తీర్చిదిద్దారు. ఇది వైద్య వ్యవస్థ ఒత్తిడి తగ్గిస్తుంది. ఇప్పటికే ఈ వెంటిలేటర్ సమాచారాన్ని 50 దేశాల్లోని 500 మంది అడిగారు.













