రవి సామినేనికి ఎఫ్ఐఎ అవార్డు
ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్నారై రవి సామినేనికి 2018 సంవత్సరానికి గాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఎ) ఉత్తమ సామాజిక సేవా పురస్కారం లభించింది. స్థానిక కొలంబస్ బ్రిడ్జి వాటర్ హాల్లో జరిగిన అవార్డుల బహుకరణ వేడుకలో అమెరికాలోని భారత రాయబారి నవ్‌తేజ్ సింగ్ సరేనా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఛైర్మన్ నీల్ పటేల్, సామినేని చేసిన వివిధ సామాజిక సేవలను వివరించారు. అమెరికాలో కన్నుమూసిన ప్రవాస భారతీయుల మ తదేహాలను తానా టీం స్క్వేర్ సంస్థ ద్వారా స్వదేశానికి చేర్చడం, బోన్ మారో డ్రైవ్‌ల నిర్వహణ, పేద అనాథ పిల్లల చదువు నిమిత్తం విరాళాల సేకరణ, మన ఊరి కోసం నిధుల సేకరణ, స్థానిక తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహియో ప్రెసిడెంట్‌గా తెలుగువారి అవసరాలు తీర్చటం, భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆపరేషన్ క్యాంపు నిర్వహణ తదితర ఎన్నో సేవలను సామినేని రవి చేశారని కొనియాడారు.













