‘నాట్స్’ ఆధ్వర్యంలో ‘‘అన్నమాచార్య సంకీర్తనా గానామృతం’’
తెలుగు భాషలో గల స్వఛ్ఛమైన భావసంపదకీ, సహజమైన తెలుగుదనానికి అన్నమయ్య కీర్తనలు నెలవులు. ప్రతి కీర్తననీ మధురభక్తితో అలౌకికజగత్తులో రచించి ఆ సౌగంధిక పుష్పాల్ని దేవదేవుని పాదాలకు సమర్పించిన అన్నమయ్య సంకీర్తన స్వర రాగ సుధను.. సంకీర్తనా మాధుర్యాన్ని.. మన అందరి హృదిలో నింపడానికి…’’అన్నమాచార్య సంకీర్తనా గానామృతం’’ ప్రముఖ సంగీత విద్వాంసురాలు గురు కొండవీటి జ్యోతిర్మయి గారి గళములో మనందరి కోసం. మన తెలుగు భాష, సంస్కృతి ఔన్నత్యానికి ఎల్లవేళలా కృషి చేసే ‘నాట్స్’ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ఇది.













