శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఘనంగా ‘మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్ 2026’
టెక్సాస్‌లోని అర్వింగ్‌లో ఉన్న అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లో శంకర నేత్రాలయ యుఎస్ఎ ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్ 2026’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ద్వారా గ్రామీణ భారతదేశంలో నివారించగల అంధత్వాన్ని నిర్మూలించే ఈ బృహత్తర లక్ష్యానికి సమాజం నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. 300 మందికి పైగా హాజరైన ఈ వేడుకను చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ చినసత్యం వీర్నపు , బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి ఆహ్వానంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శిరీష కోటమరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డాలస్ చాప్టర్ (https://sankaranethralayausa.org/dallas-chapter.html) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది.
శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు..
సమన్విత మాడ ఆలపించిన అమెరికా, భారత జాతీయ గీతాలాలాపనతో ఈ సాంస్కృతిక సాయంకాలం ప్రారంభమైంది. డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతానికి చెందిన సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్-టెక్సాస్, నాట్యోం డాన్స్ అకాడమీ, గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్, రాగలీన డాన్స్ అకాడమీ, తాండవం-స్కూల్ ఆఫ్ కూచిపూడి , రాగమయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ వంటి ప్రముఖ అకాడమీలు అద్భుతమైన ఇతివృత్తాత్మక ప్రదర్శనలను ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నృత్య ప్రదర్శనకారులను పతకాలతో, వారి గురువులను పుష్పగుచ్ఛం , శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఇవి కూడా చదవండి
2,000 కంటి శుక్లం శస్త్రచికిత్సలకు నిధుల సేకరణ..
బాలా రెడ్డి ఇందుర్తి అధ్యక్షుడిగా చేపట్టిన ఎనిమిదేళ్ల నాయకత్వంలో శంకర నేత్రాలయ యూఎస్ఏ సంస్థ ఏడు నగరాల నుండి ముప్పై నగరాలకు విస్తరించడమే కాకుండా, మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను ఐదుకు పెంచింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమం, MESU యూనిట్ల గణాంకాలను వివరించారు. మహాదాతలైన ప్రకాష్ బెడపూడి, తిరుమల్ రెడ్డి కుంభం, శ్రీని వీరవెల్లి, సునీత & డాక్టర్ రాజు కోసూరి, అర్జున్ మదాడి, డాక్టర్ కృష్ణబాబు చుండూరి, జె.కె. రెడ్డి, FCA, భీమా పెంటా, సుధాకర్ గార్లంక, ప్రేమ్ కలిదిండి వంటి దాతల ఉదారత కారణంగా సుమారు 2,000 కంటిశుక్లం శస్త్రచికిత్సలకు అవసరమైన నిధులు సేకరించారు. ముఖ్య అతిథి, శంకర రత్న పురస్కార గ్రహీత శ్రీ ప్రసాద రెడ్డి కాటమ్‌రెడ్డి , డాక్టర్ రెడ్డి ఊరిమిండి, చినసత్యం వీర్నాపు, కమిటీ సభ్యుల సమక్షంలో దాతలు, సంఘ నాయకులు ప్రత్యేకంగా సత్కరించారు.
సహకరించిన ప్రముఖులు, సంస్థలు..
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వాలంటీర్లు సమన్విత మాడ, శ్రీలక్ష్మి చక్రవర్తుల, ప్రతిష్టా భట్, అనిరుధ్ కొందురి, సాన్వి కె, విభా శ్రీవెన్, ఇషిర బుర్రా, మేఘన దారిమడుగు, నేహా దారిమడుగులు విశేష కృషి చేశారు. ప్రచారం, సాంకేతిక సహకారం అందించిన మూర్తి రేకపల్లి, శ్యామ్ అప్పాలి, వంశీ కృష్ణ ఏరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి, కార్తికేయ, దీనదయాళన్లకు కృతజ్ఞతలు తెలిపారు.
రుచికరమైన భోజనం అందించిన స్పైస్ రాక్, అలంకరణ చేసిన సంప్రదాయ డెకార్, ఫోటోగ్రఫీ , వీడియో అందించి ఎలైట్ లైవ్ ప్రొడక్షన్స్ అలాగే అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
విరాళాలు అందించడానికి లేదా మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ www.sankaranethralayausa.org ను సందర్శించవచ్చు లేదా (855) 463-8472 నంబర్‌కు టోల్-ఫ్రీ కాల్ చేయవచ్చు. పన్ను మినహాయింపు కోసం విరాళాలను Sankara Nethralaya USA, 7238 Muncaster Mill Rd, No. 522, Derwood, MD 20855 చిరునామాకు పోస్ట్ ద్వారా పంపవచ్చు.









