శాక్రమెంటోలో ఎన్ఆర్ఐలతో మంత్రి కేటీఆర్ భేటీ
ఎన్ఆర్ఐలు తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించినట్లే అభివృద్ధిలోనూ భాగస్వామ్యులు కావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటో ఉన్న ఆయన కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో రాష్ట్ర ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథాకాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు పుట్టిన గ్రామాల అవసరాల మేరకు కొంతైనా సహకారం అందించాలన్నారు. గ్రామాల్లో పాఠశాలలు, పీహెచ్సీలు, గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చినట్లు తెలిపారు. రెండో తరగతి నగరాల్లో ఐటీ విస్తరణకు ఎన్ఆర్ఐలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.













