1874 తర్వాత.. ప్రధాని మోదీకి
అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్ష భవనం లో ఘనమైన స్వాగతం లభించింది. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ మోదీకి సాదర స్వాగతం పలికారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైంది అధ్యక్షుడు ఇచ్చే విందు. అతిథులకు అధ్యక్ష దంపతులు శ్వేతసౌధంలో ప్రత్యేకంగా విందు ఇస్తారు. దీని వెనుక ఆరునెలల కసరత్తు జరుగుతుంది. దేశ ప్రథమ పౌరురాలు ఈ విందును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. 149 ఏళ్ల క్రితం 1874లో హవాయి రాజుకు ఆహ్వానంతో అమెరికాలో ఈ సంప్రదాయం మొదలైంది. తర్వాత ప్రచ్చన్నయుద్దాల సమయంలో వివిధ దేశాలను మిత్రులుగా చేసుకునే క్రమంలో పెరిగింది. కెనెడీ, రొనాల్డ్ రీగన్లు అధ్యక్షులుగా ఉన్నప్పుడు భారీగా అధికారిక విందులు ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత కాస్త తగ్గింది. జో బైడెన్ హయాంలో ఇప్పటిదాకా ఇద్దరికి (ఫ్రాన్స్ అధ్యక్షుడు, దక్షిణకొరియా అధ్యక్షుడు) మాత్రమే అధికారిక విందునిచ్చారు. బైడెన్ అరుదైన ఆహ్వానం అందుకున్న మూడో వ్యక్తి మోదీ. ప్రస్తుతం ప్రధాని మోదీకి బైడెన్ దంపతులు అధికారిక విందుతో పాటు ప్రత్యేకంగా మరో విందు కూడా ఇచ్చారు.













