ఫ్లవర్‌మౌండ్ టౌన్ ఫ్రంట్‌లైన్ సిబ్బందికి అభినందనలు
కోవిడ్ 19 వైరస్ బాధితులకు విశేష సేవలందిస్తున్న ఫ్లవర్‌మౌండ్ టౌన్ ఫ్రంట్‌లైన్ స్టాఫ్‌ను ఫ్లవర్‌మౌండ్ ఇండియన్ అమెరికన్ కుటుంబాలు అభినందిస్తూ స్నాక్స్ లు, ఫుడ్‌ను అందించాయి. నగరాన్ని వైరస్‌బారి నుంచి కాపాడుతున్న వారి సేవలను మెచ్చుకుంటూ దాదాపు 135 మంది ఫస్ట్ రెస్పాండర్స్, యుఎస్ పోస్టల్ సర్వీస్ సిబ్బందికి లంచ్‌ను అందిఞచారు. ఫ్లవర్‌మౌండ్ కౌన్సిల్ మేన్ సందీప్ శర్మ, ఫైర్, పోలీస్, యుఎస్పిఎస్ స్టాఫ్‌ను ప్రశంసిస్తూ భారతీయ కుటుంబాలు ఈ సత్కారాన్ని చేశాయి. శశాంక్ పెన్మెత్స, సతీష్ రెడ్డి, ఉపేందర్ తెలుగు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్‌క్లబ్‌కు చెందిన మోహన్ దావులూరి, వినయ్ వట్టికూటి, రవి కంఠంసెట్టి తదితరులు ఈ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. శేషారావు బొడ్డు, సుబ్బారావు పొన్నూరు, పుందరి పోతిని, ప్రసాద్ వర్మ, పల్లవి, కృష్ణ శేఖర్, మిత్ర పెన్మెత్స, అశ్విన్ కౌత, యాష్ విన్, శ్రీధర్ తుమ్మల, వెంకట్ కొడాలి, శ్రీధర్, సుమన్, వెంకట్ , శైలజ, మధు పెన్మెత్స, సంగీత తెలుగు, రేణుక భండారి చౌహాన్ తదితరులు కూడా ఈ సేవా కార్యక్రమానికి అవసరమైన సహకారాన్ని అందించారు.






