గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంగమ్, తానా ఆధ్వర్యంలో ఉత్సాహంగా ‘‘ఫాల్ కుక్ అవుట్’’
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంగమ్ (GWTCS, తానా సంయుక్తంగా ఫాల్ కుక్ అవుట్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో సభ్యులందరూ అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కుక్ అవుట్ కార్యక్రమం DMV లో జరిగింది. అక్టోబర్ 4 వ తేదీన జరిగిన ఈ కుక్ అవుట్ కార్యక్రమానికి దాదాపు 400 మంది తెలుగు సమాజం ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారంతా ఆటలు కూడా ఆడారు. అందరూ ఒక చోట చేరి, సరదా కబుర్లు కూడా చెప్పుకున్నారు. దీంతో వారికున్న ఒత్తిళ్లు దూరమై, హాయిగా, ఆనందంగా ఒకచోట గడిపారు. సరిగ్గా ఇదే సమయంలో వర్షం కూడా కురిసింది. ఆ తర్వాత ఎండ కూడా వచ్చింది. అయినా సరే.. వాటిని లెక్క చేయకుండా అందరూ అత్యంత ఆనందోత్సాహాల మధ్య వంటలు వండారు, ఆటలు ఆడారు. వేడుకను ఆస్వాదించారు. చివరికి భోజనం చేసిన తర్వాత, తమతో పాటు కొత్త జ్ఞాపకాలను తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి
ఇలా అందరూ ఒక చోట చేరడం, వంటలు చేసుకోవడం, ఆటలు ఆడుకోవడం, కొత్త వారిని పరిచయం చేసుకోవడం, స్నేహితులతో కలవడం ద్వారా మధురానుభూతులను తాము సంపాదించుకున్నామని ఇందులో పాల్గొన్నవారు హర్షం వ్యక్తం చేశారు. అందరి నివాసాలు చాలా దూరం దూరంలో వున్నా.. ఈ కార్యక్రమం ద్వారా తామంతా మరింత దగ్గరయ్యామని, అందరమూ ఒకటే అన్న భావనలో తమలో వచ్చేసిందన్నారు. అందరూ కలవడం ద్వారా ఇదో అందమైన వేడుకగా తయారైంది.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంగమ్, తానా ధన్యవాదాలు తెలిపింది. మీ భాగస్వామ్యం, ఉత్సాహం, మరియు సమాజ స్ఫూర్తి వంటివే ఇలాంటి కార్యక్రమాలను నిజంగా చిరస్మరణీయంగా చేశాయని పేర్కొంది.









