పిల్లల సృజనాత్మకతకు వేదికగా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ డ్రాయింగ్ పోటీలు.. విజేతలు వీరే!
డెట్రాయిడ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, పిల్లలకు డ్రాయింగ్ కాంపిటిషన్స్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్స్ లో పిల్లలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ ద్వారా పిల్లల్లో దాగి వున్న సృజనాత్మకత బయటపడింది. పిల్లలు కూడా తమ బుద్ధికి పదును పెట్టి, రకరకాల, అత్యంత అర్థవంతమైన డ్రాయింగ్స్ ని గీశారు.
ఇందులో పాల్గొన్న విద్యార్థులు ఎక్కువగా పర్యావరణానికి సంబంధించిన డ్రాయింగ్స్ ఎక్కువగా గీశారు. మరికొందరు మరికొన్ని రకాలైన డ్రాయింగ్స్ వేశారు. ఈ డ్రాయింగ్స్ అందర్నీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చివరికి గెలుపొందిన వారికి డెట్రాయిడ్ తెలుగు అసోసియేషన్ వారు సర్టిఫికేట్లను కూడా ప్రదానం చేశారు.
ఈ పోటీలు 6 నుంచి 10 సంవత్సరాల వయస్సు వారికి, 11 నుంచి 17 సంవత్సరాల వయస్సు వారికి, ఆ తర్వాత 18 సంవత్సరాల పైనున్న వారికి ఈ పోటీలను నిర్వహించారు.
6 నుంచి 10 సంవత్సరాల వయస్సున్న విద్యార్థులు గెలుపొందింది వీరే..
ఫస్ట్ ప్రైజ్ – ఆన్షి పాకాలపాటి
సెకండ్ ప్రైజ్ – ఆష్నా మంచినబెలే
థర్డ్ ప్రైస్ : హర్షిని బట్టు
కన్సోలేషన్ ప్రైజ్ : అద్వైత బబ్బూరి
11-17 వయస్సున్న విద్యార్థుల్లో గెలిచిన వారు..
ఫస్ట్ ప్రైజ్ – అమూల్య
సెకండ్ ప్రైజ్ – మేఘన బొడ్డు
థర్డ్ ప్రైజ్ – అద్విక్ చైతన్య గుండా
18 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో గెలిచింది..
సౌజన్య
ఈ సందర్భంగా ఈ పోటీల్లో గెలుపొందిన వారిని డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అభినందించింది. అలాగే పోటీల్లో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు ప్రకటించింది. విద్యార్థుల సృజనాత్మకత, ఊహాశక్తి ఈ కార్యక్రమాన్ని మరింత రంగులమయం చేసింది. చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులు గీచిన అద్భుతమైన కళాకృతులను అతిథులు చూసి ముచ్చటపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన, తోడ్పాటునందించిన తల్లిదండ్రులకు, వాలెంటీర్లకు, ధన్యవాదాలు ప్రకటించారు.








