తానా ఆధ్వర్యంలో బ్యాటరీతో నడిచే మూడు చక్రాల బండ్ల పంపిణీ
తానా, సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్త్రంలోని, మహబూబాద్ జిల్లా, కురివి మండలం, నేరడ గ్రామంలో తొమ్మిది మంది నిరుపేద వికలాంగులకు నాలుగు లక్షల విలువైన బ్యాటరీతో నడిచే మూడు చక్రాల బండ్లను డిసెంబర్ 21, 2020 న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గుండోజు, యం ల్ ఎ రెడ్యానాయక్ చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ కార్యక్రమానికి బండి నాగశ్వరరావు గారు అధ్యక్షత వహించారు. ఈ ప్రాజెక్ట్ రూపకర్త తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, తానా ప్రెసిడెంట్ జయ శేఖర్ తాళ్ళూరి, తానా ఫౌండేషన్ చైర్మెన్ నిరంజన్ శృంగవరపు, సామినేని ఫౌండేషన్ చైర్మెన్ సామినేని నాగశ్వరరావు, దాతలను గ్రామ ప్రజలు అభినందిచారు. తానా వారి సహాయాన్ని, వారి సేవలను పలువురు వక్తలు కొనియాడారు.
రవి సామినేని గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఖమ్మం, కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో మరిన్ని బ్యాటరీతో నడిచే మూడు చక్రాల బండ్లను ఇవ్వనున్నట్లు తెలియచేసారు. దాతలు ఎవరైన ఈ కార్యక్రమానికి సహకారం అందించాలి అనుకొంటే తానా వెబ్ పేజీలో https://www.tana.org/projects/tana_aadharana దానం చేయగలరు.













