స్మిత్ మచ్ఛర్ అభినందన సభ.. యూదు, భారతీయ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఘన సత్కారం!
అత్యంత చాకచక్యంగా, సాహసోపేతంగా వ్యవహరించి 174 మంది ఇజ్రాయెల్ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్ మిస్టర్ స్మిత్ మచ్ఛర్ (Mr. Smit Machhar) ను అభినందిస్తూ యూదు (Jewish), భారతీయ (Indian) సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చాయి. ఈ అసాధారణ ధైర్య సాహసాలను కొనియాడుతూ ఆయనకు ఘనంగా కమ్యూనిటీ ఆనర్ సెరెమనీ (సత్కార సభ) నిర్వహించనున్నారు.
కార్యక్రమ వివరాలు:
తేదీ: శుక్రవారం, అక్టోబర్ 9, 2026
సమయం: ఉదయం 10:30 AM షార్ప్
వేదిక: ఐసెలిన్ అడల్ట్ డే కేర్ సెంటర్ (Iselin Adult Day Care Center)
చిరునామా: 477 NJ-27, ఐసెలిన్, NJ 08830
పాల్గొంటున్న వారు వీరే…
ఈ అభినందన సభకు కమ్యూనిటీ నాయకులు, ప్రముఖులు , వివిధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యంగా రాబ్బీ డాక్టర్ బెర్న్‌హార్డ్ హెచ్. రోసెన్‌బర్గ్ (Rabbi Dr. Bernhard H. Rosenberg), స్టీవ్ ఫాక్స్(జీఈసీ), రాబ్బీ ఆండ్రే మెలెక్, నిమేష్ పటేల్ (దేస్ పర్దేస్), బిమల్ జోషి (చైర్మన్, డెమోక్రటిక్ పార్టీ), సుజిత్ సింగ్ (డెమోక్రటిక్), జతిందర్ బక్షి, హెచ్.కె.షా, ఉమా స్వామినాథ్ (ఏఐఏ న్యూజెర్సీ), ముకుంద్ థక్కర్, అశోక్ భట్, పియూష్ పటేల్, సురేష్ పటేల్, గీతా ఫోఫాండి, నలిన్ షా తదితరులు ఈ వేడుకకు మద్దతు తెలుపుతూ హాజరవుతున్నారు.
ఈ వేడుకకు సంబంధించిన సమాచారం, సమన్వయం కోసం నితిన్ వ్యాస్(Nitin Vyas)ను 732-470-5598 నంబర్ ద్వారా సంప్రదించవలసిందిగా నిర్వాహకులు కోరారు.








