TTA: టీటీఏ 10వ వార్షికోత్సవ వేడుకలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం..
హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telugu Association – TTA) నాయకత్వ బృందం టీటీఏ 10వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నేతలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 25, 2025న హైదరాబాద్ (Hyderabad) లోని శిల్పకళావేదిక (Shilpakala Vedika) లో జరగనున్న టీటీఏ 10వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సీఎం కూడా ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారని టీటీఏ తెలిపింది. పదేళ్లుగా ప్రవాస తెలుగు సమాజానికి సేవలందిస్తూ, సాంస్కృతిక-సామాజిక కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందింది టీటీఏ. ఆహ్వానం అందజేసిన నాయకత్వ బృందంలో అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది (Naveen Reddy Mallipeddi), డా. విజయపాల్ రెడ్డి, డా. మోహన్ రెడ్డి, భరత్ రెడ్డి మాదాడి, ఎల్ఎన్ రెడ్డి, జ్యోతి రెడ్డి, విశ్వ కంది తదితరులు ఉన్నారు.






