క్యాట్స్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలకు ఏర్పాట్లు

తెలుగువారికే కాదు, భారతీయులకు కూడా దసరా, దీపావళి పర్వదినాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అందుకే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అగ్రరాజ్యం అమెరికాలో కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (సీఏటీఎస్-క్యాట్స్) నిర్ణయించింది. అందుకే క్యాట్స్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 28న ఈ పండుగలను తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా క్యాట్స్ ఆధ్వర్యంలో జరుపుకోనున్నారు. ఈ వేడుకల గురించి మరిన్ని వివరాల కోసం www.theuscats.org వెబ్‌సైటులో చూడవచ్చు.