Sayyandi Paadam: ‘ఆటా’ 19వ మహాసభల వేళ ‘సయ్యంది పాదం’ నృత్య పోటీలు
ATA: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో జరగనున్న 19వ మహాసభల పురస్కరించుకుని, నృత్య కళాకారుల కోసం ‘సయ్యంది పాదం’ (Sayyandi Paadam) పేరుతో భారీ డ్యాన్స్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఈ పోటీలు నిర్వహించబడతాయి.
పోటీల వివరాలు:
ఈ పోటీలు సోలో , గ్రూప్ విభాగాల్లో కింది వయస్సు వారికి నిర్వహించనున్నారు.
జూనియర్స్: 7 నుండి 13 సంవత్సరాల వారు.
సీనియర్స్: 14 సంవత్సరాలు పైబడిన వారు.
అట్లాంటా, ఆస్టిన్, షార్లెట్, చికాగో, డల్లాస్, డిసి, లాస్ ఏంజిల్స్, నాష్విల్లే, రాలీ, న్యూజెర్సీ, న్యూయార్క్, ఫిలడెల్ఫియా , వాషింగ్టన్ డీసీ/మేరీల్యాండ్/వర్జీనియా ప్రాంతాల్లో ఈ పోటీలు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి
తుది పోటీలు (Finals): జూలై 31 – ఆగస్టు 2 మధ్య బాల్టిమోర్‌లో జరిగే 19వ ఆటా మహాసభల్లో నిర్వహింస్తారు.
రిజిస్ట్రేషన్ గడువు: ఏప్రిల్ 15, 2026.
ఫీజు: సోలో: ఆటా సభ్యులకు $50, సభ్యులు కాని వారికి $60.
గ్రూప్: ఆటా సభ్యులకు $60, సభ్యులు కాని వారికి $120.
బహుమతులు: విజేతలకు ప్రతిష్టాత్మకమైన ‘ఆటా టైటిల్’ అందజేయసున్నారు. విజేతలకు సినీ సెలబ్రిటీల చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు.
నిర్వహణ కమిటీ (Sayyandi Paadam Committee):
ఈ పోటీల విజయవంతానికి చైర్ ముజీబిర్ రెహమాన్, కో-చైర్ మంజువాణి, అడ్వైజర్స్ శారద సింగిరెడ్డి, రామకృష్ణ రెడ్డి అల నేతృత్వంలో కోర్ కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు.
ఆసక్తి గలవారు ataconference.org వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.








