బ్యాగ్ వాల్వ్ మాస్క్ తో ప్రయోజనాలు
అంబ్యు బ్యాగ్ పరికరం డిజైన్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా వెంటిలేటర్‌కు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయొచ్చని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ల బ•ందం కేంద్రానికి సూచించింది. అంబ్యు బ్యాగ్ డిజైన్‌ను కొద్దిగా మార్చేసి కొత్తగా తయారుచేసే ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ పరికరం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. బ్యాగ్ వాల్వ్ మాస్క్ పరికరానికి సంబంధించి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో పాటు మెకానికల్, ఏరోస్పేస్ విభాగం ప్రొఫెసర్ ఈశ్వరన్ ఇటీవల పలు ప్రతిపాదనలు చేశారు. వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ఈ మాస్కుల తయారీకి కార్యాచరణ సిద్ధం చేసేందుకు డీఆర్డీవో లేదా కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం నిపుణులతో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కరోనా ద్వారా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయాన్ని ప్రొఫెసర్ బృందం గుర్తు చేసింది.
అత్యవసర సమయాల్లో రోగులకు శ్వాస అందించే సంచిలాంటి పరికరాన్ని వైద్య పరిభాషలో అంబ్యు బ్యాగ్ అంటారు. దీన్ని విద్యుత్ అవసరం లేకుండా చేతి ద్వారానే పనిచేయిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ను తయారుచేయాలని ఐఐటీ హైదరాబాద్ సూచిస్తోంది.













