TTA: టీటీఏ సీటెల్ చాప్టర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
TTA: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సీటెల్ చాప్టర్ సమాజ సేవలో మరో ముందడుగు వేసింది. కిర్క్‌ల్యాండ్‌లోని హెలెన్స్ ప్లేస్ ఉమెన్స్ షెల్టర్‌లో టి.టి.ఏ ప్రతినిధులు విజయవంతంగా ఫుడ్ డ్రైవ్ (అన్నదాన కార్యక్రమం) నిర్వహించారు.
నాయకత్వం, ప్రతినిధులు:
ఈ సేవా కార్యక్రమం టి.టి.ఏ మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి కాంచరకుంట్ల నేతృత్వంలో జరిగింది. గణేష్ వీరమనేని (EVP), ప్రదీప్ మెట్టు (నేషనల్ కోఆర్డినేటర్), మనోహర్ బోడ్కే (ఎథిక్స్ కమిటీ డైరెక్టర్),శ్యామ్ దేశం, లావ కుమార్ రేప్‌ల, ప్రసాద్ సేనాపతి, ప్రియాంక కృష్ణ ఇందులో పాల్గొన్నారు.
యువ వాలంటీర్ల సేవలు:
ఈ కార్యక్రమంలో పెద్దలతో పాటు యువ వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా సాన్వి దేశం, చైత్ర అల్లాపురాజు, వైశాంత్ తేజ్ చన్నమాధవుని, కార్తీక్ అల్లాపురాజు, వేదాంశ్, మన్విత్, జగదీష్ మెడికుర్తి, విద్య నెల్లూరు తదితరుల సేవలను సంస్థ ప్రత్యేకంగా అభినందించింది. టి.టి.ఏ సీటెల్ చాప్టర్ తమ సామాజిక బాధ్యతను చాటుకుంటూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రతినిధులు తెలిపారు.






