అంతరిక్షమే లక్ష్యంగా.. భావోద్వేగాలే బలంగా!
విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగు ఆడియన్స్ లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ (Dulquer salman) మరో ఇంట్రెస్టింగ్ మూవీతో అలరించేందుకు రెడీ అయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆకాశంలో ఒక తార(Aakasam lo oka tara). గీతా ఆర్ట్స్(Geetha arts), స్వప్న సినిమా(Swapna cinema) సమర్పణలో సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సాధినేని(pavan sadhineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి(Satwika veeravalli) హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. తాజాగా రిలీజైన టీజర్.. కలలను సాకారం చేసుకోవాలనే తపనకు ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అడ్డంకిగా మారితే ఎదురయ్యే సంఘర్షణలను ఆవిష్కరించింది.
చదువులో డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచిన కల్పనకు వ్యోమగామి కావాలన్నది టార్గెట్. అయితే, ఆమె ఆశయాన్ని కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోతారు. ఈ క్రమంలో ఆమె మనసులోని బాధను అర్థం చేసుకుని అండగా నిలిచే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకున్నారు. హావభావాలు, సంభాషణలు, ఆయన చూపించిన సహజత్వం క్యారెక్టర్ కు బలాన్నిచ్చాయి. హీరోయిన్ గా సాత్విక వీరవల్లి తన యాక్టింగ్ తో మెప్పించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. స్పెషల్ క్యారెక్టర్ లో శృతిహాసన్ కూడా టీజర్లో ఎట్రాక్షన్ గా నిలిచారు.
డైరెక్టర్ పవన్ సాధినేని ఆశయానికి ఎమోషన్స్ ను జోడిస్తూ కథను ఇంట్రెస్టింగ్ గా మలిచినట్లు టీజర్ సూచిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కు మరింత ఇంపాక్ట్ ను ఇచ్చింది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన చిట్టి చీమ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచింది. విజువల్స్, సంభాషణలు, టెక్నికల్ వాల్యూస్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. కలలను నమ్మి ముందడుగు వేసే యువతి ప్రయాణాన్ని తెరపై చూడాలంటే నవంబర్ 20 వరకు వేచి చూడాల్సిందే.








