Kesariya: కేసరియాలానే ఆ పాట కూడా మ్యాజిక్ చేస్తుందా?
అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మాస్త్ర(Brahmastra) సినిమాలోని కేసరియా సాంగ్(Kesariya Song) ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమితాబ్ భట్టాచార్య(Amithab Bhattacharya) రాసిన ఆ పాటను ప్రీతమ్(Preetham) కంపోజ్ చేయగా, ఆర్జిత్ సింగ్(Aarjith Singh) ఆ సాంగ్ ను పాడాడు. రిలీజైన కాసేపటికే చార్ట్‌బస్టర్ గా నిలవడంతో పాటూ ఎంతో సెన్సేషన్ సృష్టించింది ఆ పాట. అయితే ఇప్పుడు ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.
ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్2 సినిమా కోసం ఈ కాంబినేషన్ మరోసారి రంగంలోకి దిగింది. వార్2లో హృతిక్ రోషన్, కియారా(Kiara Advani) పై తెరకెక్కిన ఓ లవ్ సాంగ్ కోసం వీరంతా కలిసి మరోసారి వర్క్ చేశారు. రీసెంట్ గా ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేయగా ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ స్పై యూనివర్స్ ఫిల్మ్ ఆగస్ట్ 14న రిలీజ్ కానుండగా, మరోసారి కేసరియా బృందం వార్2 సాంగ్ తో మ్యాజిక్ రిపీట్ చేసేలానే ఉన్నారు. ఆడియన్స్ కు అసలే వార్2 పై భారీ అంచనాలుండగా ఇప్పుడు కేసరియా మ్యాజిక్ కూడా తోడవడంతో ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ఆగస్ట్ 14న వార్2తో పాటూ కూలీ కూడా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.







