సౌత్ రిలీజ్‌తో మరోసారి సెన్సేషన్ అవుతుందా?
సుమారు రూ.2 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కి నార్త్ లో భారీ సక్సెస్ ను అందుకున్న హనుమాన్ అంశ్(hanuman Ansh) ఇప్పుడు సౌత్ పై దృష్టి పెట్టింది. రిలీజై దాదాపు 60 రోజులు పూర్తవుతున్నా నార్త్‌లో సినిమా జోరు కొనసాగుతుండటం విశేషం. కంటెంట్‌పై వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 9న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిల్మ్స్(Hombale films) ఈ సినిమాను సౌత్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అయితే ఈ సినిమా సౌత్ రిలీజ్‌కు ఒక కీలకమైన సవాల్ కూడా ఉంది. హిందీ వెర్షన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్లలో అందుబాటులోకి రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోని పలువురు సినీప్రియులు సబ్‌టైటిల్స్‌తో సినిమాను ముందుగానే చూసేశారు. దీంతో డే1 కలెక్షన్లపై ఈ అంశం ప్రభావం చూపించే అవకాశముంది. మరోవైపు సినిమా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ డీల్ పూర్తికాలేదు. దీంతో ఓటీటీలో వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోవడం థియేటర్లకు మరోసారి ఆడియన్స్ ను తీసుకొచ్చే అంశంగా మారొచ్చు.
ఇవి కూడా చదవండి
దసరా సెలవులు సినిమాకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 9న పెద్దగా పోటీ ఇచ్చే రీజనల్ ఫిల్మ్స్ లేకపోవడంతో హనుమాన్ అంశ్ కు థియేటర్లలో మంచి స్పేస్ లభించే పరిస్థితి ఉంది. ఇప్పటికే హిందీలో సక్సెస్ ను అందుకున్న సినిమాకు సౌత్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రాంతీయ భాషల్లో సినిమాను కొత్తగా ఎక్స్‌పీరియెన్స్ చేయాలనుకునే ఆడియన్స్ ఎంతమేర థియేటర్లకు వస్తారనేదే ఇప్పుడు కీలకం.








