రాజకీయాల్లోకి ధనుష్.. త్వరలోనే పార్టీపై క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) పొలిటికల్ ఎంట్రీపై తమిళనాడులో మరోసారి డిస్కషన్ మొదలైంది. ధనుష్, తమిళగ ఎళుచి కళగం పేరుతో కొత్త పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆల్రెడీ ఈ పేరుతో ఓ పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేశారంటూ పలు తమిళ మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ధనుష్ ప్రతినిధులు మాత్రం ఇప్పటివరకు పార్టీ పేరు ఎన్నికల సంఘం వద్ద అఫీషియల్‌గా రిజిస్టర్ కాలేదని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ధనుష్ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం మాత్రం ఖాయమని, పార్టీ పేరు సహా కీలక వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు.
మరోవైపు ధనుష్ తన అభిమాన సంఘాన్ని క్రమంగా బలోపేతం చేసుకుంటూ వస్తుండటం పొలిటికల్ డిస్కషన్లకు మరింత ఊతమిస్తోంది. అభిమాన సంఘాల కార్యకలాపాలు కేవలం ఫ్యాన్ ఈవెంట్లకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల వైపు మళ్లుతున్నాయి. జిల్లాల వారీగా నిర్వాహకుల నియామకాలు, సభ్యత్వ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల అభిమాన సంఘాల ప్రతినిధులతో ధనుష్ సమావేశాలు నిర్వహించడం కూడా ఆసక్తిని పెంచింది. జూలైలో జరిగిన ఓ సంక్షేమ కార్యక్రమంలో అభిమానుల ఐక్యతకు ఓ లక్ష్యం ఉండాలని, తమ చుట్టూ ఉన్న ప్రజలకు సేవ చేయాలని ఆయన చెప్పడం రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలకు కారణమైంది.
ఇవి కూడా చదవండి
అయితే ధనుష్ తక్షణమే ఎన్నికల బరిలోకి దిగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండి నేరుగా 2031 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ ను టార్గెట్ గా చేసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలు, కీలక పదవుల్లో ఉండే నేతలు, ఎలక్షన్ స్ట్రాటజీ వంటి అంశాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. దీంతో ధనుష్ రాజకీయ ప్రవేశం కేవలం ప్రచారానికే పరిమితమా.. లేక 2031 ఎన్నికలే టార్గెట్ గా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారా అనేది త్వరలోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.








