చిరంజీవి కోసం స్పెషల్ స్క్రిప్ట్.. కార్తిక్ సుబ్బరాజ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్తుతం కాకా(kaaka) సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి 2027 కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన నటించిన విశ్వంభర (Vishwambhara) కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి చేయబోయే ప్రాజెక్ట్‌పై మాత్రం ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. పలువురు యంగ్ డైరెక్టర్ లతో చిరూ(chiru) డిస్కషన్స్ జరుపుతున్న నేపథ్యంలో తాజాగా తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్(karthik subbaraj)తో జరిగిన భేటీ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
కార్తిక్ సుబ్బరాజ్ తాజాగా చిరంజీవిని కలిసి తన కథను వినిపించినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ స్టోరీ డిస్కషన్ లో మెగాస్టార్ కోసం స్పెషల్ గా రెడీ చేసిన స్క్రిప్ట్‌ను డైరెక్టర్ నెరేట్ చేసినట్టు సమాచారం. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా తనదైన కథనం, టేకింగ్‌తో సినిమాలు తెరకెక్కించే కార్తిక్ సుబ్బరాజ్.. చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయేలా కథను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
చిరంజీవితో సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ కార్తిక్ సుబ్బరాజ్‌కు ఎప్పటి నుంచో ఉందని, ఈ నేపథ్యంలోనే మెగాస్టార్‌ను మెప్పించే కథపై ప్రత్యేకంగా వర్క్ చేసినట్లు ఇండస్ట్రీలో డిస్కషన్ జరుగుతోంది. అయితే కథ విన్న చిరంజీవి ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం మెగాస్టార్, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైనట్టే. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.








