వారణాసిపై వార్ ఎఫెక్ట్
ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు దారి తీస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాలతోపాటు సినిమారంగంపై దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా పై కూడా పడింది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రానికి సంబంధించిన తదుపరి షెడ్యూల్ విదేశాల్లో జరగాల్సి ఉంది. సినిమా టీమ్ ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా అంతర్జాతీయ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకుందట. వారణాసి మూవీని విదేశాల్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ మూవీని ఎక్కడెక్కడ షూట్ చేయాలో ముందే ప్లాన్ చేసుకున్నారు. పర్మిషన్స్ అన్నీ తెచ్చుకున్నారు. విదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కాని మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్- అమెరికా మధ్య పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు సినిమా షెడ్యూల్స్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. దీంతో తమ షెడ్యూళ్ళను మార్చుకుని షూటింగ్ లు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర మూవీని షూట్ చేసిన సెట్ లో వారణాసి షూటింగ్ చేస్తున్నారనే వార్త లీకైంది. అక్కడ నుంచి జక్కన్న కాంప్రమైజ్ అయ్యారని.. అందుకనే దేవర సెట్ లో షూటింగ్ చేస్తున్నారని.. వార్తలు రావడం.. అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది.
అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలపై పెరుగుతున్న ఆందోళనల కారణంగా విదేశాలకు వెళ్లడం సాధ్యపడడం లేదు. ముఖ్యంగా దుబాయ్, అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రాంతాల్లో విమాన సర్వీసులు భారీగా తగ్గించడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి వంటి ప్రముఖులు విదేశాల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉండటంతో ఈ షెడ్యూల్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం టీమ్ హైదరాబాద్‌లోని దేవర సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రపంచ పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి విదేశాలకు వెళ్లే ఆలోచనలో టీమ్ ఉందట. ఈలోపు కొన్ని సీన్స్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. రాజమౌళి కాంప్రమైజ్ కారు.. ఒకవేళ ఇక్కడ షూట్ చేసినా.. అవుట్ ఫుట్ సరిగా రాకపోతే.. ఆతర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ షూట్ చేసే అవకాశం ఉందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఏదీ ఏమైనా వారణాసిపై యుద్ధం ప్రభావం మాత్రం పడినట్లే కనిపిస్తోంది.








