Viswambhara: ఉగాదికి విశ్వంభర నుంచి రానున్న అప్డేట్ ఇదే!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వశిష్ట(Vassishta) దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది.
ఎప్పుడో రిలీజ్ కావాల్సిన విశ్వంభర(Viswambhara) సినిమా షూటింగ్ లేటవడం వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. కీరవాణి(Keeravani) సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అదిరిపోయాయని ఇప్పటికే డైరెక్టర్ అంచనాలు పెంచాడు.
విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ గా రామ రామ(Rama Rama) అంటూ సాగే మాస్ సాంగ్ రానుందని, ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తైందని, చిరూ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) క్యామియో ఈ సాంగ్ లో ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సాంగ్‌ను ఉగాదికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్సుంది.













