Viswambhara: విశ్వంభరలో ఫస్ట్ సాంగ్ అదిరిందట!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), బింబిసార(Bimbisara) ఫేమ్ వశిష్ట(Vassishta)తో చేస్తున్న సినిమా విశ్వంభర(Viswambhara). సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజువల్ ట్రీట్ గా రూపొందుతున్న విశ్వంభర కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మామూలుగా అయితే విశ్వంభర ఈ సంక్రాంతికే రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే విశ్వంభర ఓ వైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటూ ఆడియో వర్క్స్ ను కూడా ఫినిష్ చేసుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు కీరవాణి(Keeravani) ఇచ్చిన సాంగ్స్ అదిరిపోయాయని, ఈ సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని డైరెక్టర్ వశిష్ఠ చెప్పాడు.
తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీలో రామ రామ(Rama Rama) అంటూ సాగే సాంగ్ అదిరిపోయిందని, రీసెంట్ గానే దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందని, ఈ సాంగ్ లో చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) కనిపించనున్నాడని తెలుస్తోంది. సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ గా ఈ పాటనే రిలీజ్ చేసే ఛాన్సుందని సమాచారం.













