టాలెంటెడ్ డైరెక్టర్ తో రౌడీ హీరో క్రేజీ ప్రాజెక్ట్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) తన నెక్ట్స్ సినిమాల విషయంలో ఇంట్రెస్టింగ్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. తాజాగా ఆయన నటించిన రణబాలి(Ranabaali) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న విజయ్కు మొదటి రోజు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సినిమా ఓ మోస్తరు కలెక్షన్లతో ప్రారంభమైన నేపథ్యంలో మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా విజయ్ తన కొత్త ప్రాజెక్ట్ గురించి వెల్లడించి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు.
ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కుమార్(Vikram kumar)తో కలిసి ఓ డిఫరెంట్ స్టోరీతో సినిమా చేయనున్నట్లు విజయ్ అనౌన్స్ చేశారు. విక్రమ్ కుమార్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, ఆయన చెప్పిన ఆలోచన కొత్తగా అనిపించడంతో వెంటనే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను నిర్మాణ సంస్థ త్వరలోనే వెల్లడించనుంది. కథా ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యమిచ్చే విజయ్, ఈసారి ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక కొంత గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన(Rowdy janardhana) షూటింగ్ లో పాల్గొననున్నారు. రవికిరణ్ కోలా(ravikiran kola) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil raju)కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri venkateswara creations) నిర్మిస్తోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత హాయ్ నాన్న(Hi nanna) ఫేమ్ శౌర్యువ్(Shouryuv) దర్శకత్వంలోనూ విజయ్ ఓ సినిమా చేయనున్నారు. ఇలా వరుసగా విభిన్న డైరెక్టర్లతో సినిమాలను రెడీ చేసుకుంటూ తన కెరీర్ను కొత్త దిశగా తీసుకెళ్లేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు.








