నాలుగు నెలలు.. ఐదు సినిమాలు.. విజయ్ సేతుపతి జోరు!
విజయ్ సేతుపతి(vijay setupati) కెరీర్లో మరో బిజీ రిలీజ్ సీజన్ మొదలుకాబోతోంది. వరుసగా సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో అక్టోబర్ నుంచి జనవరి వరకు ఆయనకు గ్యాప్ లేకుండా సందడి కనిపించనుంది. ముందుగా అక్టోబర్ 1న బత్తా(Battha)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలాజీ తరనీధరన్(balaji tharanidharan) దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ డ్రామాలో లిజోమోల్ జోస్(lizomol jos), సాయి అభ్యంకర్(sai abhyankar), సహస్ర(Sahasra) కీలక పాత్రల్లో నటించారు. గతంలో విజయ్ సేతుపతితో కలిసి పనిచేసిన బాలాజీ ఈసారి ఎలాంటి కథను చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ లోనే జైలర్2(jailer2)లో ఆయన ప్రత్యేక పాత్రతో కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ కానుంది.
ఇక విజయ్ సేతుపతి నటించిన స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్(Slum dog: 33 temple road) పై కూడా అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్(puri jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టబు(Tabu), సంయుక్త(Samyuktha) కీలక పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు నవంబర్ 20 తేదీ ప్రచారంలో ఉన్నప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరోవైపు మిస్కిన్(myskiin) దర్శకత్వంలోని ట్రైన్(train) కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. శృతిహాసన్(Shruti haasan), నాజర్(nassar) తదితరులు నటించిన ఈ సినిమాకు ఇప్పటికే టీజర్ రిలీజైంది. అయితే థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.
ఇవి కూడా చదవండి
ఈ వరుసలో చివరిగా మణిరత్నం(maniratnam) దర్శకత్వంలో రూపొందుతున్న ఇంజి వెల్లం(inji vellam) ఉంది. సాయి పల్లవి(sai pallavi)తో కలిసి విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా 2027 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఐదు సినిమాలతో విజయ్ సేతుపతి థియేటర్లలో కనిపించనుండటం విశేషం. ఒకే నటుడి నుంచి ఇంత తక్కువ గ్యాప్ లో విభిన్న జానర్ల సినిమాలు రావడం ఆయన ఫ్యాన్స్‌కు ఆసక్తికరమైన రిలీజ్ క్యాలెండర్‌గా మారుతోంది.








