Venkatesh: ఇద్దరు హీరోయిన్లతో వెంకీ

అనిల్ రావిపూడి(anil ravipudi)తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki Vasthunnam) సినిమాతో మొన్న సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్(venkatesh) ఆ సక్సెస్ ను ఎలా అయినా కాపాడుకోవాలని తర్వాతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేయనున్నాడా అందరూ ఎంతో ఆలోచించారు.
అయితే వెంకీ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్(trivikram) తో చేయనున్నట్టు కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయని, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ తెలుస్తోంది. త్రివిక్రమ్- వెంకటేష్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అందులో ఓ హీరోయిన్ గా నిధి అగర్వాల్(niddhi agerwal) ను ఫిక్స్ చేశారని అంటున్నారు. మరో హీరోయిన్ గా త్రిష(Trisha) నటించే అవకాశాలున్నాయంటున్నారు. వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం(Ramana c/o Ananda nilayam) అనే టైటిల్ ను ఈ సినిమా కోసం మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.