Vassishta: విశ్వంభర తర్వాత వశిష్ట సాలిడ్ లైనప్
కళ్యాణ్ రామ్(Kalyan Ram) తో బింబిసార(Bimbisara) సినిమా చేసి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ట(Vassishta) ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. వశిష్ట ఎవరూ ఊహించని విధంగా రెండో సినిమానే మెగాస్టార్ తో అనౌన్స్ చేసి ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర(Viswambhara) సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు వశిష్ట.
విశ్వంభర తర్వాత వశిష్ట ఎవరితో సినిమాలు చేయనున్నాడనే విషయంపై రీసెంట్ గా వశిష్ట తండ్రి మల్లిడి సత్యన్నారాయణ(Mallidi Satyannarayana) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆల్రెడీ వశిష్ట, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు ఓ కథ చెప్పాడని, అఖండ2(Akhanda2) తర్వాత ఆ సినిమా ఉండే అవకాశముందుని చెప్పారు. బాలయ్యతో పాటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కు కూడా వశిష్ట ఓ కథ చెప్పాడట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా వశిష్టను కథ చెప్పమన్నాడట కానీ ఆయనే వద్దన్నానని తెలిపాడు. బింబిసార చూశాక మీ అబ్బాయి సినిమా బాగా తీశాడు. కలిసి చేద్దాం కథ రెడీ చేసుకుమని చెప్పాడని వెల్లడించారు. అంటే దీన్ని బట్టి అటు మెగా హీరోలను, ఇటు నందమూరి హీరోలను వశిష్ట బాగానే లైన్ లో పెట్టాడని అతని తండ్రి మాటల్ని వింటుంటే అర్థమవుతుంది. మొత్తానికి విశ్వంభర తర్వాత వశిష్ట లైనప్ చాలా సాలిడ్ గానే ఉండబోతుందని తెలుస్తోంది.













