Vassishta: వశిష్ట నెక్ట్స్ అతనితోనేనా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) చేతిలో ప్రస్తుతం పలు సినిమాలుండగా, అందులో విశ్వంభర(viswambhara) కూడా ఒకటి. బింబిసార (bimbisara) డైరెక్టర్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో రానున్న ఈ సోషియో ఫాంటసీ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం విశ్వంభరకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. చిరంజీవి కూడా విశ్వంభరను సమ్మర్ లో రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే విశ్వంభర తర్వాత వశిష్ట ఏ హీరోతో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారగా, దానిపై ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్క్స్ లో వినిపిస్తోంది.
వశిష్ట నెక్ట్స్ మూవీ మాస్ మహారాజా రవితేజ(Raviteja)తో ఉండనుందని, వశిష్ట చెప్పిన కథ నచ్చడంతో వీరి కాంబోలో సినిమా లాకైనట్టు తెలుస్తోంది. వశిష్ట, రవితేజకు చెప్పిన కథ కూడా సోషియో ఫాంటసీ కథేనని సమాచారం. ఇంకా ఈ ప్రాజెక్టు చర్చల్లోనే ఉండటంతో దీనిపై అధికారిక ప్రకటన రావాలంటే కొంత కాలం వెయిట్ చేయక తప్పదు. రీసెంట్ గానే మాస్ జాతర(Mass Jathara)తో డిజాస్టర్ ను మూట గట్టుకున్న రవితేజ, ప్రస్తుతం కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే.







