ఎన్టీఆర్ గాయంతో డ్రాగన్ కు ఊహించని ఆటంకం
ఎన్టీఆర్(NTR) భుజానికి గాయమైన నేపథ్యంలో ఆయన కొంతకాలం పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న తన ఇంట్లో ఆయన కోలుకుంటున్నారని, ఫిజియోథెరపీతో కంటిన్యూ అవుతుందని సమాచారం. డాక్టర్ల సూచన మేరకు వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఎలాంటి వర్క్ కమిట్మెంట్స్ తీసుకోకుండా హెల్త్ పైనే దృష్టి పెట్టాలని కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా సూచించినట్లు సమాచారం.
దీంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) తెరకెక్కిస్తున్న డ్రాగన్(Dragon) సినిమా షూటింగ్‌కు తాత్కాలిక విరామం లభించింది. ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్స్‌ను వాయిదా వేయడంతో పాటు శ్రీలంకలో జరగాల్సిన కీలక షూటింగ్ ను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, రుక్మిణి వసంత్(Rukmnini Vasanth)లపై షూట్ చేయాల్సిన ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆ షెడ్యూల్‌ను రెడీ చేసినప్పటికీ, హీరో ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని యూనిట్ వెయిట్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
షూటింగ్‌ను తిరిగి సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పాత్రలో కనిపించనున్నారని, అఫీమ్ స్మగ్లింగ్, డ్రగ్ వార్స్ నేపథ్యంతో కథ సాగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్‌లో థియేటర్లలో రిలీజయ్యేలా ప్రణాళిక కొనసాగుతోంది. ప్రస్తుత విరామం చిత్ర నిర్మాణ షెడ్యూల్‌ను స్వల్పంగా ప్రభావితం చేసినా, రిలీజ్ డేట్ పై మాత్రం పెద్దగా ప్రభావం ఉండదనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.








