జయకృష్ణ ఎంట్రీకి షాకింగ్ ఓపెనింగ్స్.. ఎక్కడ తప్పు జరిగింది?
సూపర్‌స్టార్ కృష్ణ(Krishna) కుటుంబం నుంచి ఎన్నో సంవత్సరాల తర్వాత హీరోగా పరిచయమైన జయకృష్ణ ఘట్టమనేని(Jayakrishna Ghattamaneni) నటించిన శ్రీనివాస మంగాపురం(Srinivasa mangapuram) రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ చూపలేకపోతోంది. దివంగత రమేష్ బాబు(Ramehs babu) కొడుకుగా, కృష్ణ మనవడిగా జయకృష్ణ ఎంట్రీపై సినీ వర్గాల్లో ప్రారంభంలో ఆసక్తి కనిపించినా, ఆ అంచనాలను బాక్సాఫీస్ వద్దకి తీసుకురావడంలో చిత్రబృందం విఫలమైందనే డిస్కషన్ సాగుతోంది. అజయ్ భూపతి(Ajay bhupathi), జీవీ ప్రకాశ్ కుమార్(GV Prakash Kumar) వంటి ప్రముఖ టెక్నీషియన్లు పనిచేసిన ఈ సినిమాకు నిర్మాణ పరంగా మంచి స్థాయి కనిపించినప్పటికీ, రిలీజ్ కు ముందు సరైన ప్రచార వ్యూహం అమలు కాలేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సాధారణంగా ఒక కొత్త హీరో సినిమాకు ప్రీరిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటరాక్షన్స్, డిజిటల్ ప్రమోషన్స్ కీలకంగా మారుతున్న సమయంలో ఈ సినిమా ఆ అవకాశాలను దాదాపు వినియోగించుకోలేదు. మహేష్ బాబు(Mahesh babu) ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేయడం మినహా ఫ్యామిలీ నుంచి పెద్దగా ప్రచారం జరగకపోవడం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. రిలీజ్ రోజునే ఓపెనింగ్స్ నిరాశపరిచాయని, సాయంత్రానికి కూడా కలెక్షన్లలో గణనీయమైన పెరుగుదల కనిపించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేని పలువురు డెబ్యూ హీరోల కంటే కూడా ఈ సినిమాకు తక్కువ స్థాయి ఓపెనింగ్ కలెక్షన్లు నమోదయ్యాయని సమాచారం.
సినిమాకు మిక్డ్స్ రెస్పాన్స్ రావడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. జయకృష్ణ తన తొలి ప్రయత్నంలో యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ, కథ, కథనం, దర్శకత్వం ప్రధాన బలహీనతలుగా మారాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ దాదాపు నిలిచిపోవడం, చిత్రబృందం నుంచి కొత్త ప్రచార కార్యక్రమాలు లేకపోవడం గమనార్హం. నిర్మాతలు కొన్ని బకాయిలను ఇంకా క్లియర్ చేయలేదనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొత్తం మీద, జయకృష్ణకు వ్యక్తిగతంగా మంచి గుర్తింపు వచ్చినా, శ్రీనివాస మంగాపురం కమర్షియల్ పరంగా తీవ్ర నిరాశ మిగిల్చే సినిమాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.








