రామాయణ ట్రైలర్ పై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్
రణబీర్ కపూర్(Ranbir kapoor), సాయి పల్లవి(Sai Pallavi), యష్(Yash) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న రామాయణ ట్రైలర్(Ramayana Trailer) రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ ను అందుకుంది. అద్భుతమైన విజువల్స్, మంచి ప్రెజెంటేషన్, హాలీవుడ్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్, కథనానికి మరింత బలం చేకూర్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయని ప్రేక్షకులు, సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నంగా ఈ సినిమాను పలువురు ప్రశంసిస్తున్నారు. ధర్మం- అధర్మం మధ్య జరిగే శాశ్వత పోరాటాన్ని భారీ కాన్వాస్‌పై చూపించే సినిమాగా ట్రైలర్ ఆసక్తిని పెంచింది.
ట్రైలర్ ప్రభావంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) సోషల్ మీడియాలో స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే కాదని, ధర్మం అధర్మంపై ఎప్పుడూ గెలుస్తుందని చెప్పే ఉదంతమంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్ ట్రైలర్‌కు లభిస్తున్న ఆధ్యాత్మిక, ఎమోషనల్ రియాక్షన్ ను ప్రతిబింబిస్తోంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ యాక్టింగ్ లో కనిపించిన ప్రశాంతత, ఎమోషనల్ డెప్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. సీతగా సాయి పల్లవి సౌమ్యమైన రూపంతో ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటుండగా, రావణుడిగా యష్ కనిపించిన తీవ్రత, స్క్రీన్ ప్రెజెన్స్, పాత్ర రూపకల్పన ట్రైలర్‌కు మెయిన్ ఎట్రాక్షన్ గా మారాయి.
హాన్స్ జిమ్మర్(Hans jimmer), ఏఆర్ రెహ్మాన్(AR Rahman) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత వైభవాన్ని తీసుకొచ్చిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నితేష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా(Namith Malhotra), యష్(Yash) నిర్మిస్తున్న ఈ సినిమా భారతీయ కథన సంప్రదాయాన్ని ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో మేళవించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. రామాయణ పార్ట్1 ఈ దీపావళికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారతీయ పురాణ గాథను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసే అరుదైన సినిమాటిక్ ఈవెంట్‌గా ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.








