విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ రిలీజ్ కు ఊహించని రెస్పాన్స్
థియేటర్లలో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమాకు ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందనుకోవడం మామూలే. కానీ సూర్య(suriya) నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath and sons) విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. వెంకీ అట్లూరి(venky atluri) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజై కమర్షియల్ సక్సెస్ సాధించింది. సెప్టెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన తర్వాత సినిమాపై సోషల్ మీడియాలో డిస్కషన్ ఒక్కసారిగా మరో దిశలోకి వెళ్లింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ పై నెటిజన్లు ట్రోలింగ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
థియేట్రికల్ రన్లో సినిమాకు కలిసొచ్చిన ఫ్యామిలీ ఎమోషన్, ఏజ్ గ్యాప్ రిలేషన్షిప్ ట్రాక్.. ఓటీటీ ఆడియన్స్‌కు మాత్రం అదే స్థాయిలో కనెక్ట్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల సక్సెస్ సాధించిన బెత్లెహెం కుటుంబ యూనిట్(bethlehem kutumba unit) తో సినిమాను పోలుస్తున్నారు. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌ను ఎలివేట్ చేయడానికి కథలో ఎన్ని అంశాలు అవసరం, ఎమోషన్‌ను ఎంతవరకు సహజంగా చూపించాలి అనే డిస్కషన్‌కు ఈ రెండు సినిమాలు కారణమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
విశ్వనాథ్ అండ్ సన్స్ లో సరోగసీ, పిల్లాడికి అరుదైన వ్యాధి, హీరో తల్లి చనిపోవడం, ఎక్స్ట్రా మ్యారిటల్ ట్రాక్, సెకండ్ ఫ్యామిలీ వంటి పలు అంశాలను కథలో భాగం చేశారు. అదే సమయంలో బెత్లెహెం కుటుంబ యూనిట్ లో చాలా పరిమితమైన నేపథ్యంతోనే సంబంధాల మధ్య ఎమోషన్ ను స్ట్రాంగ్ గా చూపించారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఓటీటీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ డిస్కషన్ లో ఒక కొత్త ప్రశ్న తెరపైకి వచ్చింది. ఎమోషన్‌ను బలపరిచేందుకు కథలో మరిన్ని పొరలు అవసరమా? లేక స్క్రీన్ ప్లే సహజంగా సాగితేనే ఆడియన్స్ కు మరింతగా కనెక్ట్ అవుతుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో విశ్వనాథ్ అండ్ సన్స్ పై జరుగుతున్న డిస్కషన్ ఈ అంశం చుట్టూనే తిరుగుతోంది.








